NZB: జిల్లాలో రెడ్‌క్రాస్ సొసైటీ సేవలు అభినందనీయమని ప్రభుత్వ ఫ్లాగ్షిప్ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు సలహాదారుడు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో కోల్డ్ స్టోరేజ్‌ను ఆదివారం ఆయన ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. కోల్డ్ స్టోరేజీ యూనిట్ ప్రారంభంతో రక్త నిల్వ సామర్థ్యం మరింత మెరుగుపడుతుందన్నారు.