KDP: గండి కోట ఉత్సవాలు-2026 వేడుకలు జిల్లాలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత, పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్, ప్రభుత్వ విప్ ఆది నారాయణ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పలువురు ప్రముఖులను సన్మానించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.