ELR: కుక్కునూరు (M) సీతారామనగరంలో 27 సుంకం చెల్లించని తెలంగాణ మద్యం సీసాలతో ఓ వ్యక్తి పై ఆదివారం కేసు నమోదు చేశామని జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ సీఐ శ్రీను బాబు తెలిపారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ సూపెరిండెంట్ అజయ్ పాల్గొన్నారు.