PDPL: సింగరేణి ఆర్జీ-1 పరిధిలో అద్దె వాహనాల ఎంపిక కోసం నిన్న జీఎం కార్యాలయంలో పర్చేజ్ విభాగం ఆధ్వర్యంలో డ్రా నిర్వహించారు. సివిల్ విభాగం అవసరాల కోసం ఐదేళ్ల కాలానికి గాను ఒక నాన్ టిప్పర్ లారీ, 5 లారీలు, నలుగురు అన్స్కిల్డ్ కార్మికుల ఎంపిక పూర్తి చేశారు. పారదర్శకంగా జరిగిన ఈ ప్రక్రియలో ఒక విజేతతో పాటు ముగ్గురు స్టాండ్ బై బిడ్డర్లను ఎంపిక చేశారు.