SRCL: ప్రాచీన సంస్కృతి, కళలను కాపాడుకుందామని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ రాజన్న ఆలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధన మహోత్సవాల ముగింపు కార్యక్రమం నిన్న సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా ఆయన పాల్గొని కళాకారులను సన్మానించారు. త్యాగరాజ స్వామి వంటి గొప్ప కళాకారుడి ఆరాధన ఉత్సవాలను వేములవాడలో నిర్వర్తించారు.