ADB: గాదిగూడ మండలంలోని సాంగ్వి గ్రామపంచాయతీ సర్పంచ్ మడావి సరస్వతి, ఉప సర్పంచ్ కొడప సంతోష్ బుధవారం కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారం, పార్టీ బలోపేతానికి కృషి చేయాలనీ సుగుణ పేర్కొన్నారు. సాంగ్వి గ్రామాభివృద్ధికి తమవంతు సహకరిస్తామని ఆమె హమీ ఇచ్చారు.