E.G: రాజమండ్రిలోని కోటిలింగాలపేట వాటర్ పంప్ హౌస్ సమీపంలో బుధవారం భోగి పండుగ వేళ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడి తుప్పల్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. స్థానిక బీజేపీ ప్రతినిధి నందివాడ సత్యనారాయణ వెంటనే స్పందించి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.