BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామంలో భోగి, మకర సంక్రాంతి పండుగల సందర్భంగా ఇంటి ముందు అక్క-చెల్లెళ్లు, వదినలు, మరదళ్లు కలిసి రంగురంగుల ముగ్గులు వేసి సంబరాలు జరుపుకుంటున్నారు. సంక్రాంతి అంటే ఆడవాళ్లకు ముఖ్యమైన పండుగ అని భావించి.. మహిళలు ఉదయాన్నే లేచి తలస్నానాలు చేసి ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెడతారు.