VZM: గుర్ల మండలం వల్లాపురం, దమరసింగి, కెల్లలో ఏర్పాటుకానున్న స్టీల్ ప్లాంట్‌కు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్-221 కాపీలను వల్లాపురం, దమరసింగి రైతులు, యువత భోగి మంటలో వేసి నిరసన తెలిపారు. స్టీల్ ప్లాంట్ వల్ల పచ్చని పొలాలు నాశనం అవుతాయని, ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.