SRCL: వేములవాడ భీమేశ్వరాలయానికి బుధవారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి కోడె మొక్కు చెల్లించుకున్నారు. మేడారం సమ్మక్క సారక్క భక్తుల రాకతో రద్దీ మరింత పెరిగింది. శ్రీ స్వామి వారి దర్శనం త్వరితగతిన జరగడానికి వీలుగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు.