AP: పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమిరంలో సంక్రాంతి కోడిపందేల జోరు మొదలైంది. ఇక్కడ జరుగుతున్న పందేలను ఏపీ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు ఆసక్తిగా తిలకించారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి కూడా పాల్గొన్నారు. పండగ పూట బరిలో పుంజుల పోరును చూసేందుకు నేతలు, ప్రజలు భారీగా తరలివచ్చారు.