VZM: నెల్లిమర్ల నియోజకవర్గంలో సంక్రాంతి పండుగ సంబరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లోకం మాధవి పూసపాటిరేగ మండలం కందివలస గ్రామంలో నిర్వహించిన ముగ్గుల పోటీలను సందర్శించారు. గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్బంగా గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.