KNR: కేంద్రం నుంచి నిధుల వరద కొనసాగాలంటే కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్కు చెందిన 51వ డివిజన్ మాజీ కార్పొరేటర్ బీ. వేణు ఆధ్వర్యంలో పలువురు నాయకులు బీజేపీలో చేరారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో అత్యధిక డివిజన్లలో బీజేపీ కార్పొరేటర్లను గెలిపించాలని ఆయన కోరారు.