ప్రకాశం: కనిగిరి లోని సీతారాముల వారి దేవస్థాన ప్రాంగణంలో బుధవారం గోదాదేవి రంగనాథుల కళ్యాణ మహోత్సవం దేవస్థానం అధ్యక్షులు సుబ్రమణ్యం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వెంకటేశ్వర శర్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవ సందర్భంగా సుందరంగా అలంకరించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్ధ ప్రసాదాలను అందజేయడం జరిగింది.