HNK: ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయాన్ని మాజీ మంత్రి, MLC బస్వరాజు సారయ్య, GWMC 25వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజు శిరీష శ్రీమన్లు ఇవాళ సందర్శించారు. ఈ సందర్బంగా వారు స్వామివారిని దర్శించుకుని, పూజలు చేశారు. ఆలయ ఈవో సుధాకర్ వారికి స్వాగతం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు వారు తెలిపారు.