KMR: బిచ్కుంద పట్టణంలో నేడు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టె నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పిలుపునిచ్చారు. ప్రధాన రహదారిపై ముగ్గులు వేసి నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సెంట్రల్ లైటింగ్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.