SKLM: పాతపట్నం మండలం పెద్ద సీదిలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఇవాళ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గోవిందరావు హాజరయ్యారు. ముగ్గుల పోటీలలో విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. సంక్రాంతి పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు చేస్తుందన్నారు. మహిళల ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి పోటీలు అవసరం అని అన్నారు.