W.G: పేరుపాలెం తీరం బుధవారం పర్యాటకులతో కిక్కిరిసింది. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి సందర్శకులు భారీగా తరలివచ్చారు. తెలంగాణ నుంచి వచ్చిన వాహనాలతో తీర ప్రాంతం కోలాహలంగా మారింది. పర్యాటకులు సముద్ర స్నానాలు ఆచరిస్తూ, తీరంలో కేరింతలు కొడుతూ ఉత్సాహంగా గడిపారు. సమీపంలోని కొబ్బరి తోటల్లో వనభోజనాలు ఏర్పాటు చేసుకుని పండగ వేడుకలను ఆస్వాధించారు.