VZM: కొత్తవలస పట్టణం మంగళవీధిలో భోగి పండగను బుధవారం ఘనంగా నిర్వహించారు. వీధిలో ఉన్న యువకులు, పెద్దలు,పిల్లలు, కొత్తబట్టలు ధరించి భోగి మంటను కాగారు. ముందురోజు రాత్రి యువకులు భోగికి కావల్సిన సామాగ్రి సమకూర్చి వేకువజామున అత్యంత వైభవంగా భోగి వేడుకలు సంప్రదాయ పద్ధతిలో జరుపుకొన్నారు. పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయాలు చాలా ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.