SRCL: రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న ‘యంగ్ ఇండియా సమీకృత గురుకులాల’ పనులను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. కలెక్టర్లు, టీజీఈడబ్ల్యూఐడీసీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. భవన నిర్మాణాల్లో నాణ్యత పాటించాలని, ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షించాలని సూచించారు.