KMR: బాన్సువాడ మండలం హనుమాజీపేటలో గృహజ్యోతిపథకం ప్రొసీడింగ్ కాపీలను అర్హులకు సర్పంచ్ లావణ్య బుధవారం పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే వారికి ఈ పథకం వర్తిస్తుందన్నారు. కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షుడు భాను గౌడ్, సాయిలు, డాక్టర్ సంజీవులు, తుకారాం, భాగయ్య పాల్గొన్నారు.