KNR: జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారుల కొరత రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు శాపంగా మారింది. రెగ్యులర్ అధికారులు లేక జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు ఇంఛార్జ్లుగా కొనసాగుతున్నారు. తిమ్మాపూర్ వంటి చోట్ల 3 నెలల్లోనే నలుగురు అధికారులు మారడం గమనార్హం. దీంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో జాప్యం జరుగుతోందని జిల్లావాసులు చర్చించుకుంటున్నారు.