SRCL: ఆర్అండ్బీ అధికారుల నిర్లక్ష్యం.. ప్రయాణికుల పాలిట శాపంగా మారుతుంది. ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామం సమీపంలో సిరిసిల్ల- కామారెడ్డి ప్రధాన రహదారిపై గల బ్రిడ్జిపై భారీ గుంతపడి ప్రమాదకరంగా మారింది. ఈ మార్గంలో ప్రతిరోజు వేలాది వాహనాలు వెళ్తుంటాయి. సంబంధిత అధికారులు వెంటనే మరమ్మతు చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.