BHPL: రేగొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో పలు గ్రామానికి చెందిన 63 మంది లబ్ధిదారులకు రూ. 18,12,000 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను MLA గండ్ర సత్యనారాయణ రావు పంపిణీ చేశారు. MLA గండ్ర మాట్లాడుతూ.. ప్రజల కష్టసుఖాల్లో ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, సీఎం సహాయ నిధి ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు తక్షణ సాయం అందుతుందని తెలిపారు.