ELR: ఏలూరులో పోలీసు ప్రధాన కార్యాలయ ఆవరణలో సంక్రాంతి సంబరాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రతాప శివ కిషోర్, ఆయన సతీమణి ధాత్రి రెడ్డి (రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవో) దంపతులు సంప్రదాయబద్ధంగా భోగి మంటలు వేసి, చిన్నారులకు భోగి పళ్లు పోశారు. అనంతరం పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఎడ్లబండిపై విహరించి అందరినీ అలరించారు.