SRD: జిన్నారం మున్సిపాలిటీలో శుక్రవారం మున్సిపల్ ప్రజలు ఆనందోత్సాహాలతో కనుమ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఇంటి ముందు కల్లాపి చల్లి రథం ముగ్గులు, రంగురంగుల అందమైన ముగ్గులు వేసి సంప్రదాయాన్ని చాటారు. పండగ వాతావరణంతో కాలనీలు కళకళలాడాయి. చిన్నపిల్లలు, కుటుంబ సభ్యులు కలిసి కనుమ సంబరాల్లో పాల్గొన్నారు.