HYD: రాష్ట్రంలో జైలు పాలైన వారిలో 30 ఏళ్ల లోపు యువతే అధికమని 2025 జైళ్ల శాఖ నివేదిక వెల్లడించింది. ఈ నివేదికను HYDలో DG సౌమ్య మిశ్రా శిక్షణ సంస్థలో విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఖైదీలు 42,566 మంది కాగా, అందులో 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన యువత 19,413 మంది ఉన్నట్లు తెలిపారు. అంటే మొత్తం ఖైదీల్లో 45 శాతం యువతే ఉండటం ఆందోళనకరమన్నారు.