భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. సచిన్‌ను అధిగమించి అంతర్జాతీయ క్రికెట్లో వేగంగా 28,000 పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. విరాట్ ఇప్పటివరకు 623 ఇన్నింగ్స్‌ల్లో 28,003 పరుగులు చేశాడు. సచిన్ 644 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు.