MDK: రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం ప్రభుత్వ పాఠశాలలో 50వ సంవత్సరం 10వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్ శర్మ తెలిపారు. 1976 సంవత్సరంలో ఈ పాఠశాలలో 10వ తరగతి ప్రారంభమైందని, 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా 100% ఉత్తీర్ణత సాధించే విధంగా విద్యార్థులకు ప్రత్యేక బోధన చేస్తున్నామన్నారు.