AP: విజయవాడలోని లెనిన్ కూడలిలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కృష్ణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే అసాధారణ వ్యక్తి కృష్ణ అని అన్నారు. కృష్ణ మంచి తనం, ధైర్యం చూసి ఎంతో మంది ఆయనకు అభిమానులయ్యారని తెలిపారు. ఇప్పటికీ ఆయన సూపర్‌స్టారే అని RRR వ్యాఖ్యానించారు.