ATP: గుత్తి పెన్షనర్స్ భవనంలో ఆదివారం మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రీ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి చిత్ర పటానికి కోశాధికారి జన్నే కుల్లాయిబాబు, సెక్రెటరీ రామ్ మోహన్ పూల మాల వేసి నివాళులర్పించారు. శాస్త్రి చివరి శ్వాస వరకు దేశానికి అంకితం చేసిన గొప్ప దేశ భక్తుడు అని వారు పేర్కొన్నారు.