‘మన శంకరవరప్రసాద్ గారు’ ప్రమోషన్స్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టార్ హీరోలైన బాలకృష్ణ, వెంకటేష్, చిరంజీవిలతో సినిమా చేశానని అన్నాడు. మరో స్టార్ నాగార్జునతో మూవీ ఎప్పుడంటూ అందరూ అడుగుతున్నారని, తనకు ఆయనతో పనిచేయాలని ఉందని తెలిపాడు. నాగ్‌తో మూవీ చేస్తే నలుగురు అగ్ర హీరోలతో వర్క్ చేసిన ఈతరం దర్శకుడిగా రికార్డు నాదే అవుతుందని పేర్కొన్నాడు.