KRNL: నగర పరిశుభ్రతతోనే ప్రజారోగ్యం సాధ్యమని నగర కమిషనర్ పి.విశ్వనాథ్ పేర్కొన్నారు. 7, 12, 14 శానిటేషన్ డివిజన్ల పరిధిలోని 127 ఖాళీ స్థలాలతో పాటు నగర వ్యాప్తంగా 250 కి పైగా ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన పిచ్చి మొక్కల తొలగింపునకు 15 జేసీబీలతో ఆదివారం 2వ విడత స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. బళ్ళారి చౌరస్తా వద్ద కమిషనర్ జెండా ఊపి ఈ డ్రైవ్‌ను ప్రారంభించారు.