సత్యసాయి: పుట్టపర్తి జిల్లా కార్యాలయంలో స్వతంత్ర సమరయోధుడు శ్రీ వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా వడ్డెర్ల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల చక్రపాణి పాల్గొన్నారు. వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన త్యాగాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.