W.G: కోపల్లె వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. భీమవరం నుంచి కాళ్ల వైపు వెళుతున్న లారీ, రోడ్డుపై నడిచి వెళుతున్న వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం భీమవరం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కాళ్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.