GNTR: సీఎం చంద్రబాబుతో నేడు జంగా కృష్ణమూర్తి భేటీ కానున్నారు. టీటీడీ బోర్డు మెంబర్ పదవికి జంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై చర్చించేందుకు సీఎంఓ నుంచి జంగాకు పిలుపు వచ్చింది. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో కలిసి జంగా ఈరోజు సీఎంను కలవనున్నట్లు జంగా సన్నిహితులు తెలిపారు. సీఎంతో చర్చల అనంతరం జంగా నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.