సోషల్ మీడియా వేదికలో అసభ్యకరమైన, అశ్లీల కంటెంట్‌ను తొలగించాలని కేంద్రం ‘X’కు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మస్క్ నేతృత్వంలోని ఎక్స్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ మేరకు అశ్లీల కంటెంట్‌కు సంబంధించిన 3500 పోస్టులు, 600 ఎక్స్ ఖాతాలను బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.