AP: సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే కోడిపందాలతో పాటు పేకాటను ఆడ్డుకోవాలని హైకోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. కోడిపందాలు అడ్డుకునేందుకు అవసరమైతే ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది. జంతు హింస నిరోధక చట్టంతో పాటు ఏపీ జూద నిరోధక చట్టం అమలుచేయాలని స్పష్టంచేసింది.