MLG: తాడ్వాయి- మేడారం మధ్య వాహనాలు భారీగా నిలిచిపోయాయి. మేడారం నుంచి తాడ్వాయి వచ్చే మార్గంలో శ్రీరాం సాగర్ చెరువు వద్ద 3KM మేరా ట్రాపిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు నెమ్మదిగా కదులుతుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ని క్రమబద్ధీకరిస్తున్నారు.