PDPL: సంక్రాంతి పండగను సురక్షితంగా జరుపుకోవాలని, జూలపల్లి ఎస్సై సనత్ కుమార్ సూచించారు. చైనా మంజా విక్రయం, వినియోగం పూర్తిగా నిషేధమని, ఇది ప్రజల ప్రాణాలకు ముప్పని హెచ్చరించారు. పండుగ వేళ రద్దీ ప్రాంతాల్లో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు. వాహనదారులు హెల్మెట్, సీటుబెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపరాదని వెల్లడించారు.