KDP: సంక్రాంతి పండుగ సందర్భంగా జూదం, కోడి పందాలు, గుండాట తదితర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని SP నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. కోడిపందేలు, జూదం జరిగే అవకాశమున్న అనుమానిత ప్రాంతాల్లో అత్యాధునిక డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా ఉంటుందన్నారు. వారిపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.