NRML: గాలిపటాలు ఎగురవేసేందుకు నిషేధిత చైనా మాంజాను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని భైంసా టౌన్ సీఐ సాయి కుమార్ వ్యాపారులను హెచ్చరించారు. ఇవాళ భైంసాలోని పలు దుకాణాలను తనిఖీ చేశారు. చైనా మాంజా వల్ల మనుషులు, పక్షుల ప్రాణాలతో పాటు పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన పేర్కొన్నారు. పండుగ వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.