MLG: మేడారం మహాజాతరకు 4 రోజులు సెలవులివ్వాలని మంత్రి సీతక్క ఉపాధ్యాయ సంఘాల నాయకులు వినతి పత్రం అందజేశారు. స్టేట్ టీచర్స్ యూనియన్ అధ్యక్షుడు మధుసూదన్ మాట్లాడుతూ.. ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు జరిగే జాతరను తమ కుటుంబంతో కలిసి సందర్శిస్తామని పేర్కొన్నారు. ఉపాధ్యాయ సంఘాల వినతిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.