AP: బెంగళూరు ప్యాలెస్ కేంద్రంగా మాజీ సీఎం జగన్ కుట్ర చేస్తున్నారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆరోపించారు. జగన్ కుట్రలపై దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కుట్రలకు కేంద్రంగా మారిన బెంగళూరు ప్యాలెస్పై తాను దర్యాప్తు సంస్ధలకు లేఖ రాస్తానని తెలిపారు. జగన్ వ్యాఖ్యలతో వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారని విమర్శించారు.