AKP: పాయకరావుపేట సీతారామాలయంలో ఈనెల 27వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఇందులో భాగంగా ఆదివారం ఆలయ ప్రాంగణంలో పెళ్లిరాట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో విశేష పూజలు జరిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.