KRNL: ఆస్పరి మండలం బనవనూరు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బోయ నాగేష్ అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి తనయుడు, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి బుసినే చంద్రశేఖర్ భౌతికదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.