VKB: తాండూరులోని 12వ వార్డు ఆదర్శ తులసి నగర్లో డ్రైనేజీ నీరు రోడ్డుపై ప్రవహిస్తుండటంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి మురుగు నీరు నిలిచి దుర్వాసన వస్తుండటంతో వాహనదారులు, పాదచారులు ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీ సమస్య ను పరిష్కరించి, రోడ్డును శుభ్రం చేయాలని కోరుతున్నారు.