VZM: రేపు ప్రారంభంకానున్న పదోతరగతి పరీక్షలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఆదివారం రాష్ట్ర పరిశీలకులు తహిరా సుల్తానా జిల్లా స్థాయి స్క్వాడ్ బృందాలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో ఎటువంటి మాస్ కాపింగ్ జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను ఆమె ఆదేశించారు. ఈ సమావేశంలో డీఈవో మాణిక్యం నాయుడు పాల్గొన్నారు.