ASR: తాజంగి కేజీబీవీలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రత్యేక అధికారి కె. సుమామాధురి తెలిపారు. ఈ విద్యాసంస్థలో 6వ తరగతి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం వరకు మొత్తం 85 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఏప్రిల్ 12లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు తమను సంప్రదించాలన్నారు.