AP: రాజకీయాల్లో వారసత్వాన్ని ప్రోత్సహించడం తనకు ఇష్టం ఉండదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అందుకే తన కుమారుడు, కుమార్తెను రాజకీయాల్లోకి తీసుకురాలేదని తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటమే పిల్లలకు మనమిచ్చే సంపదని పేర్కొన్నారు. తన పిల్లలకు వారసత్వంగా స్వర్ణ భారత్ ట్రస్ట్ మాత్రమే ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు.